Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల-తోకలు తీసేస్తారని చెప్పాం... పవన్ కళ్యాణ్ మా స్నేహితులే.. నారా లోకేష్

బుధవారం నాడు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించిన అనంతరం నారా లోకేష్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆక్వా ఫుడ్ కంపెనీ వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై మాట్లాడారు. కంపెనీ ఇప్పటికే 300 ఎకరాలను సమీకరించిందనీ, అక్కడ కేవలం ఆక్వాకు

Advertiesment
తల-తోకలు తీసేస్తారని చెప్పాం... పవన్ కళ్యాణ్ మా స్నేహితులే.. నారా లోకేష్
, బుధవారం, 19 అక్టోబరు 2016 (20:33 IST)
బుధవారం నాడు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించిన అనంతరం నారా లోకేష్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆక్వా ఫుడ్ కంపెనీ వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై మాట్లాడారు. కంపెనీ ఇప్పటికే 300 ఎకరాలను సమీకరించిందనీ, అక్కడ కేవలం ఆక్వాకు సంబంధిన వాటికి తల-తోకలు తీసేసి మిగిలినది ఎగుమతి చేస్తారనీ, అక్కడ రసాయనాలు కలపడం వంటివేమీ ఉండవన్నారు. 
 
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన కొన్ని సూచనలు చేశారనీ, ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటుందన్నారు. కొన్ని పార్టీలు అసలు అభివృద్ధి కార్యక్రమాలే వద్దంటూ అడ్డుపడుతున్నాయనీ, ఆక్వా ఫుడ్ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయనీ, ఉద్యోగాలు గాల్లోంచి ఊడిపడవన్నారు. రాష్ట్రాభివృద్ధికి తను వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కదా అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకిన్ ఇండియా... మ‌న త‌యారీ ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చేసింది