సెల్ఫీలు దిగితే తప్పా? 20రోజులు దేశమంతా తిరిగా.. ఐదారొందల ఫోటోలు దిగా: నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సంబంధించిన ఫారిన్ ఫోటోలు అప్పట్లో నెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విదేశీ అమ్మాయిలతో తిరిగారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సంబంధించిన ఫారిన్ ఫోటోలు అప్పట్లో నెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విదేశీ అమ్మాయిలతో తిరిగారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నారా లోకేష్ స్పందించారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో 'ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా.. 'మీరు విదేశీ అమ్మాయిలతో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. అది నిజమా?' అని సునీల్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందిస్తూ.. సెల్ఫీలు దిగితే తప్పా.. సెల్ఫీలు దిగేటప్పుడు మనం వెరైటీ వెరైటీ ఫోజులు ఇస్తుంటాం.. తానూ అలాగే చేశానని నారా లోకేష్ అన్నారు.
2006లో స్టాన్ ఫర్డ్ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగానని వెల్లడించారు. ఈ సందర్భంగా చాలా ఫోటోలు తీశాను. దాదాపు ఐదారొందల ఫోటోలు ఉంటాయని, వాటిలో మూడు ఫొటోలే 'సాక్షి' పత్రికలో వేశారని అన్నారు.
ప్రత్యేక హోదాపై నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీకి హోదా వల్ల ఉద్యోగాలు రావని, ప్రత్యేక రాయితీలతోనే అవి సాధ్యమన్నారు. అనంతపురం జిల్లాకు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌ను తెస్తామన్నారు. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. మరో ఐదుసార్లు చంద్రబాబే రాష్ట్రానికి సీఎంగా ఉంటారన్నారు. బాబుకు అండగా ఉంటారో.. జగన్‌తో నిలబడతారో ఆలోచించుకోవాలన్నారు. సాక్షి దినపత్రికపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ పత్రిక అసత్య వార్తలను ప్రచారం చేస్తుందని చెప్పారు.