Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నబియ్యం సన్నాసీ.. డ్రాయర్‌పై నిలబెట్టి గుడివాడ వీధుల్లో తిపిస్తా : కొడాలి నానికి లోకేశ్ మాస్ వార్నింగ్

nara lokesh
, బుధవారం, 23 ఆగస్టు 2023 (11:53 IST)
వైకాపాలో బూతుల నేతగా గుర్తింపుపొందిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ నేత నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అరే.. సన్నబియ్యం సన్నాసి.. గుర్తు పెట్టుకో. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడ్‌డ్రాయర్‌పై నిలబెట్టి గుడివాడ వీధుల్లో ఊరేగించకపోతే నా పేరు లోకేశ్ కాదు అంటూ హెచ్చరించారు. 
 
గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగిస్తూ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా జిల్లాలో ఎందుకూ పనికిరాని నలుగురు మంత్రులు అయ్యారు. ఒకడు సన్న బియ్యం సన్నాసి. క్యాసినోలు, గుట్కాపై తప్ప వాడికి ఏ అంశం పైనా అవగాహన ఉండదు. సన్న బియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలతో సంబంధం లేని నా తల్లిని అవమానించాడు. వాడిని డ్రాయర్‌పై నిలబెట్టి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లే బాధ్యత నాది.
 
రాముడు తల నరికేస్తే చూసి నవ్వుకునేవాడు దేవాదాయశాఖ మంత్రి అయ్యాడు. మాడిపోయిన పల్లీకి దేవాలయాలను అభివృద్ధి చెయ్యడం తెలియదు. కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోవడంలో ఆయన ఎక్స్‌పర్ట్. ఇంకో ఆయన పనికిమాలిన నాని. అందుకే పదవి పోయింది. అధికారుల అంతు చూస్తా, జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నాడు. 
 
ముగ్గురు మంత్రులు పోయారు నాలుగో వాడు వచ్చాడు... జోకర్ జోగి. ఒక్క ఇల్లు కట్టడం చేతకాని జోకర్ జోగి ప్రతిపక్ష నేత ఇంటిపై రాళ్లు వెయ్యడానికి వస్తాడు. వీరితో పాటు పిల్ల సైకో ఒకడు ఉన్నాడు. వాడు ఎవడో కాదు.. ఈ గన్నవరం ఎమ్మెల్యే. వల్లభనేని వంశీ. దేవాలయం నాటి గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టించాడు. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టించాడు. తస్మాత్ .. జాగ్రత్త. వీళ్లకు తగిన శాస్తి చేయించే బాధ్యత నాది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 
 
చప్పట్లు కొట్టే కుక్కలు వైకాపా నేతలు : నారా లోకేశ్ ఫైర్ 
 
ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టి ప్రోత్సహించిన కుక్కలు కృష్ణా జిల్లా వైకాపా నేతలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా, మంగళవారం రాత్రి గన్నవరం వేదికగా యువగళం బహిరంగ సభ జరిగింది. ఇందులో లోకేశ్ వాడివేడిగా ప్రసంగించారు. వైకాపా నేతల పరువు తీసిపారేశాడు. కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నేతలను కుక్కలతో పోల్చారు. 
 
కృష్ణా జిల్లా వైసీపీ నేతలు పిరికి సన్నాసులు అని విమర్శించారు. 'ఇతర జిల్లాల్లో వైసీపీ కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తర్వాత మొరిగేవి. కృష్ణా జిల్లా వైసీపీ కుక్కలు నేను జిల్లాలో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నాయి' అంటూ ఎద్దేవా చేశారు. "లోకేశ్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి అని వైసీపీ కుక్కలు మొరిగాయి. అమ్మలాంటి అమరావతిని చంపేసిన ఈ కుక్కలకు నన్ను ప్రశ్నించే హక్కు ఎవడిచ్చాడు? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పుట్టిన గడ్డకి జగన్ అన్యాయం చేస్తుంటే చప్పట్లు కొట్టిన కుక్కలు మనకి నీతులు చెబుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త తలను ఒడిలో పెట్టుకున్న భార్య.... మాటు వేసిన ప్రియుడు సుత్తితో కొట్టి చంపేశాడు..