Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

ఐటి హబ్‌గా ఆంధ్రప్రదేశ్... మంత్రి నారా లోకేష్

ఉత్పాదక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆర్ధిక ప్రగతికి దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం

Advertiesment
Nara lokesh delhi tour
, బుధవారం, 28 జూన్ 2017 (21:49 IST)
ఉత్పాదక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆర్ధిక ప్రగతికి దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్న నేపద్యంలో మంత్రి నారా లోకేష్ కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్, ఆశాఖ కార్యదర్శి అజయ్ సహాని, ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం ఢిల్లీలో కలసి ఐటి రంగ అభివృద్ధికి అనుసరించవలసిన కార్యచారణపై చర్చించినట్లు తెలిపారు.
 
తొలుత మంత్రి లోకేష్ ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మహేంద్ర, అసోసియేషన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ భవన్లో సమావేశమై ఐటి రంగ అభివృద్ధికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతినిధులకు వివరించి ఇందుకు సహకరించాలని ప్రతినిధులను కోరారు. మహిళలు, యువత, విద్యార్ధులకు గ్రామ, పాఠశాలస్థాయి నుంచే మొబైల్స్ తయారీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాది కల్పిస్తూ ఐటి రంగంలో లక్ష మందికి పారిశ్రామిక రంగంలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలను కల్పించే విధంగా కృషిచేస్తున్నట్లు వివరిస్తూ, ఇందుకు ఆయా సంస్థలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
 
చైనాతో పోటీపడి ఇండియాలో మొబైల్ తయారీ రంగం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని టాక్స్ రాయితీలు, విధాన పరమైన నిర్ణయాలు,ఇతర దేశాలకు మొబైల్ ఎక్సపోర్టు చేసేందుకు రాయితీలు అవసరం అని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చినట్లు మంత్రి వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగ అభివృద్ధికి ప్రోత్సాహం- కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్   
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆ శాఖ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ నికేతన్ భవన్లో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగ అభివృద్ధి కొరకు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. మొబైల్స్ తయారి, వైద్య రంగంలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆయా యూనిట్ల ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రికి వివరించారు. రానున్న ఆరు మాసాలలో చేపట్టనున్న ఆయా రంగాల యూనిట్ల ఏర్పాట్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని సాదరంగా ఆహ్వానించినట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య... డ్యూటీ దుస్తుల్లోనే(వీడియో)