Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య: మంత్రి నారా లోకేష్

న్యూఢిల్లీ : భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సహాయ సహకారాలు అందించారని, వీరి కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఐ.టి శాఖల మం

Advertiesment
భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య: మంత్రి నారా లోకేష్
, గురువారం, 10 ఆగస్టు 2017 (20:27 IST)
న్యూఢిల్లీ : భారతదేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సహాయ సహకారాలు అందించారని, వీరి కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఐ.టి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతించారు.
 
భారతదేశ 13వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్య నాయుడును న్యూఢిల్లీ లోని ఆయన స్వగృహంలో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నిబద్దత, క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన ప్రజాసేవకు తార్కాణం శ్రీ వెంకయ్య నాయుడని, నేటి యువతరానికి వారి సూచనలు, సలహాలు ఎంతో ఉపయుక్తం అని అన్నారు.
 
భారతదేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నిక కావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని అన్నారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనప్పటికి ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ వెంట పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్, మాగంటి వెంకటేశ్వర రావు (మాగంటి బాబు), అవంతి శ్రీనివాస రావు, జెసి దివాకర్ రెడ్డి, ఎంఎల్సి గాదె శ్రీనివాసులు నాయుడు, ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకయ్య రాజకీయ వారసురాలిగా దీప... రాణిస్తారా?