శాసనమండలిలో తలపండిన నేతల కాదు.. సీన్ మారింది.. కరణం-నారా లోకేష్‌ల ఎంట్రీ
ఏపీ అసెంబ్లీ ఆవరణలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆసక్తికర చర్చ సాగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్‌ల మధ్య శాసనమండలిపై చర్చ సాగింది. గతంలో శాసనమండలి అంటేనే తలపండిన సీనియర్ న
ఏపీ అసెంబ్లీ ఆవరణలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆసక్తికర చర్చ సాగింది. కార్యాలయంలో సీనియర్ నేతలు కరణం బలరాం, పయ్యావుల కేశవ్‌ల మధ్య శాసనమండలిపై చర్చ సాగింది. గతంలో శాసనమండలి అంటేనే తలపండిన సీనియర్ నేతలకు పరిమితమైన సభగా పేరుంది. అందుకే దీన్ని పెద్దల సభ అని పిలిచేవారు.
అయితే ప్రస్తుతం సీన్ మారింది. సీనియర్లుండే మండలిలో ఇక యువ నాయకులు కూడా ఎంట్రీ ఇస్తున్నారని కరణం బలరాం, పయ్యావుల కేశవ్ మాట్లాడుకున్నారు. కాగా, 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన కరణం బలరాం.. ఇటీవలే శాసనమండలికి ఎన్నికైన ఆయన మార్చి 30న సభలో అడుగుపెడుతున్నారు.
అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈయన కూడా మండలిలో అడుగుపెట్టనున్నారు. తద్వారా ఎమ్మెల్సీగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం 2017లో మొదలవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1978 బ్యాచ్ మొదలుకుని 2017 బ్యాచ్ నాయకుల వరకు సభ్యులుగా ఉన్నారని పయ్యావుల వ్యాఖ్యానించారు.