పీకల్లోతు సమస్యలున్నా... నవ్వుతూ, పెళ్లిళ్ళకు హాజరవుతున్న జగన్ స్టయిల్ లోకి ఇపుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వచ్చేసినట్లున్నారు. ఎంత సేపు రాజకీయాల్లో మునిగి తేలే ఆయన ఇపుడు వరుసపెట్టి, వివాహాది శుభ కార్యాలకు హాజరవుతున్నారు.
ఏపీ సీఎం జగన్ విరివిగా వివాహ వేడుకలకు హాజరవుతున్న ఫోటోలు వైరల్ అవుతుండగా, ఇపుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా వివాహాది శుభ కార్యాలకు వరసపెట్టి హాజరవుతున్నారు.
నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకుడు, పీసీపీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కుమారుని వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులకు తనదైన శైలిలో చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే, తన మామగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలు రిసెప్షన్ కు నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి ఇద్దరూ హాజరై అశీర్వాదాలు అందజేశారు. తమ కుటుంబంలో జరిగిన శుభ కార్యానికి దంపతులు ఇద్దరూ హాజరై అభినందనలు తెలిపారు.