Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరుకు నారా బ్రహ్మణి... గల్లా జయదేవ్ మరోచోటికి...

నారా కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలు రానుంది. నారా లోకేష్‌ను వివాహం చేసుకున్న బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మిణి రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అటు పారిశ్రామికంగా, ఇటు రాజకీయంగా అన్నింటిపైన అవగాహన ఉన్న బ్రాహ్మణి ప్రత్యక్ష ఎన్నికల్లోక

Advertiesment
గుంటూరుకు నారా బ్రహ్మణి... గల్లా జయదేవ్ మరోచోటికి...
, బుధవారం, 19 జులై 2017 (12:50 IST)
నారా కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలు రానుంది. నారా లోకేష్‌ను వివాహం చేసుకున్న బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మిణి రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అటు పారిశ్రామికంగా, ఇటు రాజకీయంగా అన్నింటిపైన అవగాహన ఉన్న బ్రాహ్మణి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. అందులోను గుంటూరులోనే పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. నందమూరి కుటుంబానికి బాగా కలిసొస్తున్న ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఆ ప్రాంతాల్లోనే పోటీ చేస్తే గెలుపు ఈజీ అన్న ఆలోచనలో ఉన్నారట.
 
తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మిణి గుంటూరు ఎంపిగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఒక హామీని కూడా మామ నుంచి బ్రాహ్మిణి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు ఎంపిగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోనుండటంతో చంద్రబాబు కోడలు అడిగిన వెంటనే హామీ ఇచ్చేశారట. 
 
నారా బ్రాహ్మిణి రాజకీయాల్లోకి రావడం కుటుంబ సభ్యుల్లో అందరికీ ఇష్టమేనట. తన కుమార్తె రాజకీయాల్లోకి వస్తుండటం తండ్రి బాలక్రిష్ణకు మరింత ఇష్టమట. మరి చూడాలి నారా బ్రాహ్మిణి రాజకీయాల్లోకి వచ్చి ఏవిధంగా ముందుకెళతారో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాసలీలల ఆధారాలు బయటపెడతా... బాధిత మహిళ -మేటికి మళ్లీ తలనొప్పి