Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రాస్కెల్‌ను నడిరోడ్డుపై అలా చేయాలి, పెదాలు పగులగొడుతున్నా భరించాలా? నన్నపనేని ప్రశ్న(Video)

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తలోకెక్కే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి అలాంటి పనే చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన నన్నపనేని రాజకుమారి సహనాన్ని కోల్పోయారు. చిత్తూరుజిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజే

ఆ రాస్కెల్‌ను నడిరోడ్డుపై అలా చేయాలి, పెదాలు పగులగొడుతున్నా భరించాలా? నన్నపనేని ప్రశ్న(Video)
, మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (21:41 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తలోకెక్కే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మరోసారి అలాంటి పనే చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన నన్నపనేని రాజకుమారి సహనాన్ని కోల్పోయారు. చిత్తూరుజిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్ - శైలజ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. తప్పంతా గతంలో రాజేష్ దేనన్న నన్నపనేని రాజకుమారి ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు.
 
రాజేష్ నపుంశకుడు కాదని రిపోర్ట్ రావడమే కాదు అతనికి బెయిల్ కూడా వచ్చిందంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దాన్ని పెద్దగా పట్టించుకోని నన్నపనేని ఆగ్రహంతో ఊగిపోయారు. రాజేష్‌కు బెయిల్ లభించినా శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుందన్నారు. అతడు తన భార్య పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించి దారుణంగా కొట్టిన రాజేష్‌ను నడిరోడ్డుపై నరకాలన్నారు నన్నపనేని రాజకుమారి. 
 
మహిళలు, యువతులు బయటకు వెళ్ళేటప్పుడు ఆయుధాలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే కేంద్రబడ్జెట్ పైనా మాట్లాడారు.  కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. మహిళా అభ్యున్నతికి నిధులు కేటాయించమని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారామె. ప్రధానికి అస్సలు మానవత్వం లేదని, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అధికంగా నిధులు కేటాయించి మరికొన్ని రాష్ట్రాలను ప్రధాని గాలికొదిలేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రధాని తన తప్పు తెలుసుకుని జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ఎపికి అవసరమైన నిధులను కేటాయించేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలల్లో మధుమేహం మాయం... అమరావతిలో వైద్యుడు కాని వైద్యుడి సలహా