సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టెక్నికల్ సహకారం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ రాయ్, మరికొందరు అధికారులను కలిశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆహ్వానం మేరకు వారు వచ్చారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌లో ఉన్న అత్యుత్తమ కన్సల్టెన్సీ ఏమిటని చంద్రబాబు వారిని అడిగినట్లుగా సమాచారం. రాష్ట్ర అవసరం ఏమిటని సింగపూర్ అధికారులు చంద్రబాబును అడిగారట.
శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు తమ రాష్ట్రం విస్తరించి ఉందని, అందరికీ అందుబాటులో ఉండేలా ఒక రాజధాని నిర్మాణం చేయడం తమ లక్ష్యమని చంద్రబాబు వారికి చెప్పారు.
ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ తలదన్నేలా నిర్మించాలని చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేసినా అత్యుత్తమమైనదిగా నిర్మిస్తామని, ఇందుకోసం సింగపూర్, మలేషియా తరహాలో నగరాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని మంత్రి పి నారాయణ చెప్పారు.