దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితిని అంతా సందడిగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసి పూజలు చేసేందుకు భక్తులు క్యూకడుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజామున మూడు గంటల నుంచి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మోపిదేవిని సందర్శించుకుని స్వామివారికి పూజలు చేశారు. బారులు తీరుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో లీలా కుమార్, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.