Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

హింసిస్తున్నాడు మొర్రో అంటుంటే... నా భార్య FB పోస్టుకి లైక్ చేస్తావా అంటున్న లీడర్

ఇటీవలే తన భర్త, కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా నాయకుడు యతేంద్ర రామకృష్ణ తనను శారీరకంగానూ, మానసికంగానూ వేధిస్తున్నాడంటూ ఆయన భార్య తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణి కుమారి ఫేస్ బుక్ లు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆమె విన్నపాన్ని చూసిన తర్వాతైనా పోలీ

Advertiesment
Nagireddy
, గురువారం, 28 జూన్ 2018 (13:37 IST)
ఇటీవలే తన భర్త, కృష్ణా జిల్లాకు చెందిన తెదేపా నాయకుడు యతేంద్ర రామకృష్ణ తనను శారీరకంగానూ, మానసికంగానూ వేధిస్తున్నాడంటూ ఆయన భార్య తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణి కుమారి ఫేస్ బుక్ లు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఆమె విన్నపాన్ని చూసిన తర్వాతైనా పోలీసులు స్పందించారో లేదో తెలియదు కానీ హరిణికుమారి పెట్టిన పోస్టుకు తెలప్రోలుకు చెందిన భీమవరపు నాగిరెడ్డి లైక్‌ కొట్టేశాడు.
 
ఆ పోస్టుకి లైక్ కొట్టినదాన్ని చూసిన హరిణి భర్త రామకృష్ణ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. నా భార్య పోస్టుకే లైక్‌ కొడతావా, నీకెంత ధైర్యం అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణ చెలరేగింది. ఒకరికొకరు బాహాబాహీకి దిగేంతవరకూ వెళ్లారు. చివరికి స్థానికులు కలుగజేసుకోవడంతో వీళ్లిద్దరూ కలిసి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మరి హరిణి వ్యవహారం ఏమైందో తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసులకు అసభ్యకరమైన దుస్తులా? ఇక అలాంటివొద్దు..?