ఎమ్మెల్యే రోజాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు...
నిత్యం వివాదాల్లో ఉండే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా చాలా రోజులకు ఓ మంచి పని చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... వెళ్తే, సింధు (25) అనే అమ్మాయి నిన్న
నిత్యం వివాదాల్లో ఉండే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా చాలా రోజులకు ఓ మంచి పని చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... వెళ్తే, సింధు (25) అనే అమ్మాయి నిన్న తన స్కూటీపై చిత్తూరు నుంచి తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్శిటీకి బయలుదేరింది. మార్గమధ్యంలో నేండ్రగుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆమె స్కూటీని ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది.
ఈ ఘటనలో తలకు బలమైన దెబ్బ తగలడంతో, రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయింది సింధు. అదే సమయంలో జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకావడానికి రోజా అదే మార్గంలో వెళుతున్నారు. ఈ సమయంలో సింధును గుర్తించిన ఆమె... తన వాహనంలో పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో తీసుకురావడంతో... సింధు ప్రాణాలతో బయటపడింది.
ఈ నేపథ్యంలో, రోజా చేసిన ఈ మానవీయ సహాయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అనేక మంది నెటిజన్లు రోజా చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాము ఏ పార్టీకి చెందిన వారిమైనప్పటికీ... ఒక మంచి పని చేస్తే, పార్టీలకు అతీతంగా ప్రజలు వారిని అభినందిస్తారనే దానికి ఇదే నిదర్శనం.