Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరాయి మహిళతో ఉపాధ్యాయుడి అక్రమ సంబంధం.. భర్త ఇంట్లో లేని సమయంలో?

ఓ ఉపాధ్యాయుడు పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. నాగర్ కర్నూల్‌కు చెందిన చందునాయక్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న

Advertiesment
Nagar kurnool crime news
, శుక్రవారం, 17 మార్చి 2017 (09:10 IST)
ఓ ఉపాధ్యాయుడు పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. నాగర్ కర్నూల్‌కు చెందిన చందునాయక్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో తరచూ వెళ్తూ వస్తుండేవాడు.

ఉపాధ్యాయుడు గురువారం తనింట్లో ఉన్నాడని గుర్తించిన సదరు మహిళ భర్త డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చందు నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళ భర్త కూడా ఉపాధ్యాయుడే. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. వివాహాలైనా ప్రేమ బంధాన్ని వీడలేక చనిపోయేందుకు ఓ ప్రేమ జంట సిద్ధపడింది. ఈ ఘటన పీలేరు మండలంలో చోటుచేసుకుంది. పీలేరు వెంకటాద్రి ఇండ్లు ప్రాంతానికి చెందిన ఎం. మల్లికార్జున (25), పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన పూజిత (21) ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని పెద్దలు రెండున్నరేళ్ల క్రితం పూజితకు వివాహం చేశారు. 
 
అలాగే మల్లికార్జునకు కూడా మూడు నెలల క్రితం బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. కానీ ప్రేమ బంధాన్ని వీడలేక గురువారం వీరిద్దరూ విషం తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న మల్లికార్జునను, పూజితను పీలేరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇరువురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏటీఎం అంటే ఆల్ టైమ్ మెంటల్ కాదట.. డబ్బులే డబ్బులట