Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019లో పవన్ పవర్లోకి వస్తాడు.. డబ్బు కోసమే సినిమాల్లో?: నాగబాబు జోస్యం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ స్వయంగా తనకంత రాజకీయ అనుభవం లేదని.. అన్నీ నేర్చుకున్నాకే క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకుంటానని చెప్తుంటే.. తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మెగా సోదరుడు నాగబాబు మద్దతుగా నిలిచారు. 2

Advertiesment
Nagababu
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (13:50 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ స్వయంగా తనకంత రాజకీయ అనుభవం లేదని.. అన్నీ నేర్చుకున్నాకే క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకుంటానని చెప్తుంటే.. తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మెగా సోదరుడు నాగబాబు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పవర్లోకి వస్తాడని నాగబాబు జోస్యం చెప్పేశారు. ఒక ఓటరుగా ఇది తన నమ్మకం అని నాగబాబు వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీ గల పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరమని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
జనసేన అధినేత ఎవరి నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని, పైగా ఇతరులకోసం తన డబ్బును ఖర్చు చేశాడని, ఒక రాజకీయ పార్టీని నడపాలంటే డబ్బు ఎంతైనా అవసరమని నాగబాబు అన్నారు. అందుకే సినిమాల్లో పవన్ నటిస్తున్నాడని తెలిపారు. పనిలో పనిగా ఏపీలోని తెలుగు దేశం పార్టీ సర్కారును నాగబాబును విమర్శించారు. 
 
ఏపీ రాజధాని అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారే కానీ.. అలాంటి చర్యలేమీ తమకు కనిపించట్లేదని చెప్పారు. అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. అయితే తమ్ముడు టీడీపీపై ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించనప్పటికీ.. నాగబాబు మాత్రం తెలుగుదేశం పార్టీపై ఏకేయడం చూస్తుంటే.. పవన్ కల్యాణ్‌లో జోష్‌ను నింపి.. ఒత్తిడి పారద్రోలేందుకు నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే అనుమానం రాక తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్‌ను పొట్టనబెట్టుకున్న ప్యూరింటన్‌.. పిజ్జా పార్లర్‌లో పాత్రలు కడిగాడట..