Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నాగబాబు.. తమ్ముడికి తోడుగా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మెగా బ్రదర్ నాగబాబు చేతులు కలుపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి రాక్షసుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. అన్నయ్యతో కలిసి కొన్ని సినిమాలు తీశారు. తర్వాత సో

జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నాగబాబు.. తమ్ముడికి తోడుగా..
, మంగళవారం, 31 జనవరి 2017 (12:10 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మెగా బ్రదర్ నాగబాబు చేతులు కలుపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి రాక్షసుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. అన్నయ్యతో కలిసి కొన్ని సినిమాలు తీశారు. తర్వాత సోలోగా ఒకటీ రెండు సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత క్యారెక్టర్ పాత్రలు వేస్తూ వచ్చారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా నాగబాబు  కొన్ని సినిమాలు తెరకెక్కించారు. 
 
అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చే నాగబాబు ఆప్పట్లో చిరు పార్టీ పెట్టినపుడు పార్టీ తరపు నుంచి ప్రచారం చేశారు. తర్వాత ఇండస్ట్రీకి చిరంజీవి చిన్నతమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చారు. చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ తర్వాత అన్నబాటలో నడుస్తూ రాజకీయాల్లోకి వచ్చారు.
 
చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్‌కి మెగా ఫ్యామిలీకి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. మొన్న విశాఖ పట్నంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జరపాలనుకున్న మౌన ప్రదర్శనకు నాగబాబు పూర్తి మద్దతు ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. అంతే కాదు చిరంజీవి రాజకీయాల్లో నెమ్మదిగా ఇన్ యాక్టివ్ అయిపోతున్న నేపథ్యంలో తమ్ముడి వైపు మొగ్గుతున్నట్లున్నారు నాగబాబు. 
 
జనసేన మద్దతిచ్చిన విశాఖ నిరసన ర్యాలీకి నాగబాబు కూడా సపోర్ట్ చేయడం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే 2019 ఎన్నికలకు ముందు నాగబాబు జనసేన తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ కోసం పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ప్రత్యేక హోదాపై పవన్ ఇచ్చిన పిలుపుకు మద్దతు పలికారు. దీనిని బట్టి నాగబాబు త్వరలోనే జనసేనాని సరసన నిలిచే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ