Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త హత్య .. భార్యను పట్టించిన మద్యం సీసా మూత బార్ కోడ్

భర్త హత్య .. భార్యను పట్టించిన మద్యం సీసా మూత బార్ కోడ్
, ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (17:15 IST)
తెలంగాణా రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లాలో మద్యం సీసా మూతపై ఉండే బార్ కోడ్ ఓ హత్య కేసులోని నిందితులను పట్టించింది. ఈ హత్య కేసులో కట్టుకున్న భర్తను భార్యే హత్య చేయించినట్టు తేలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం అద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళతో 14 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, శ్రీనివాస్ మద్యం సేవించివచ్చి ప్రతి రోజూ భార్యను వేధించసాగాడు. భార్యను మాత్రమేకాకుండా కన్నతల్లిదండ్రులను, పిల్లలను కూడా చిత్రహింసలు పెడుతూ వచ్చాడు. దీంతో భర్త పీడ ఎలాగైనా వదిలించుకోవాలని భార్య లక్ష్మీ భావించింది. 
 
ఇందుకోసం తన ఇద్దరు తమ్ముళ్లు, తల్లి, తండ్రితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ హత్య జనవరి 29వ తేదీన జరిగింది. ఆ తర్వాత మృతేదేహాన్ని ధర్మవరం ఏరియాలో ఉన్న రవల్‌కోల్ గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని కాల్చిన ప్రాంతంలో ఓ మద్యం సీసా బాటిల్‌ మూత లభ్యమైంది. దీన్ని సేకరించిన పోలీసులు.. ఆ మూతపై ఉన్న బార్‌కోడ్ ఆధారంగా ఆ మద్యం బాటిల్‌ను ఏ దుకాణంలో కొనుగోలు చేశారో తెలుసుకున్నారు. 
 
ఆ తర్వా వైన్ షాపు వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మద్యం సీసాను కొనుగోలు చేసింది శ్రీనివాస్‌గా గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. దీంతో శ్రీనివాస్, యాదగిరి, రమేష్, స్వప్నలతో పాటు ఈమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానంలో నేను పోటీ చేయను... అఖిల ప్రియా రెడ్డి