శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్.. సుజనాపై నోరెత్తకు.. నాలుక కోస్తా
నటుడు శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటెత్తితే నాలుక కోస్తానంటూ శివప్రసాద్ ఫైర్ అయ్యారు. శుక్రవారం చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.
నటుడు శివాజీకి ఎంపీ శివప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాటెత్తితే నాలుక కోస్తానంటూ శివప్రసాద్ ఫైర్ అయ్యారు. శుక్రవారం చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే సుజనాచౌదరిని సీఎం తొత్తు అని శివాజీ అని వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు.
ఇకనైనా మాట తీరు, పద్ధతి మార్చుకో. లేదంటే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సుజనా చౌదరి రాష్ట్ర సమస్యలను నొక్కి చెప్తున్నారని శివప్రసాద్ తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య వారధిగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి.. కీలకంగా వ్యవహరిస్తున్నారని శివాజీకి గుర్తు చేశారు.
అలాంటి నేతను సీఎంకు తొత్తు అంటూ నిందారోపణలు చేయడం శివాజీకి తగదని.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇకనైనా మాట తీరు.. పధ్ధతి మార్చుకోవాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివాజీకి హెచ్చరికలు చేశారు.