షాపుకెళ్లలేదని.. కన్నబిడ్డను చావగొట్టిన తల్లి: తలకు తీవ్రగాయాలు.. మృతి
అమ్మతనానికే ఆ తల్లి మచ్చ తెచ్చింది. తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించింది. చెప్పిన మాట వినకపోవడంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళ బిడ్డను గొడ్డుని బాదినట్లు బాదింది. దీంతో తల్లిచేతిలో ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ప
అమ్మతనానికే ఆ తల్లి మచ్చ తెచ్చింది. తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించింది. చెప్పిన మాట వినకపోవడంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళ బిడ్డను గొడ్డుని బాదినట్లు బాదింది. దీంతో తల్లిచేతిలో ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని పహాడీషరీఫ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. జంజంకాలనీలో ఉండే ఫిరోజ్‌బేగం తన కూతురు ఫెర్దోస్ ఫాతిమా(8)ను మంగళవారం మధ్యాహ్నం షాపుకి వెళ్లమని చెప్పింది. అయితే, ఆ బాలిక తాను ఆడుకుంటున్నానని, షాపుకి వెళ్లనని తెగేసి చెప్పేసింది.
ఎంత చెప్పినా ఫాతిమా తాను వెళ్లనంటే వెళ్లనని చెప్పడంతో కోపం తెచ్చుకున్న ఫెర్దోస్ ఫాతిమా... తన బిడ్డను కర్రతో చావగొట్టింది. ఫిరోజ్ బేగం కొట్టిన దెబ్బలకు తలపై బలమైన గాయాలు కావడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయింది.