పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కుమార్తె... కుమారులతో కలిసి కడుపుకోసి కడతేర్చిన తల్లి
కడుపున పుట్టిన కుమార్తె... పెళ్లికాకుండానే గర్భందాల్చిందన్న కోపంతో... తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుమార్తె కడుపు కత్తితో కోసి హతమార్చిందో తల్లి. కుటుంబ పరువు కోసం ఆమె కన్నబిడ్డపై ఉన్న మకారాన్ని చంపుకు
కడుపున పుట్టిన కుమార్తె... పెళ్లికాకుండానే గర్భందాల్చిందన్న కోపంతో... తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుమార్తె కడుపు కత్తితో కోసి హతమార్చిందో తల్లి. కుటుంబ పరువు కోసం ఆమె కన్నబిడ్డపై ఉన్న మకారాన్ని చంపుకుంది. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే...
రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం మైసిగండి గ్రామపంచాయతి పరిధిలోని వెలుగురాళ్ల తండాకు చెందిన ఇస్లావత్ దేవ్లా, సోనిలకు ఒక కూతురు, ముగ్గురు కుమారులున్నారు. తండ్రి దేవ్లా మరణించడంతో వారి కూతురు ఇస్లావత్ మంజుల(19) కొంతకాలంగా నల్లగొండ జిల్లా దేవరకొండలోని బంధువుల ఇంట్లో నివశిస్తూ వస్తోంది.
వారం క్రితం మంజుల వెలుగురాళ్ళకు చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం మంజుల కడుపు ఉబ్బెత్తుగా కనిపిస్తోందని తల్లి మంజులను నిలదీసింది. గర్భందాల్చిన సంగతి నిజమేనని ఒప్పుకున్న మంజుల దానికి కారకులు ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో సోని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ విషయాన్ని తన ఇద్దరు కుమారులు బబ్లూ, జగన్‌లకు చెప్పింది. ఆ తర్వాత వారి సాయంతో మంజులను హతమార్చాలని నిర్ణయించింది.
తన ప్లాన్ ప్రకారం.. కుమార్తెను తన ఇద్దరు కుమారులతో కలిసి పొలం వద్దకు తీసుకెళ్లింది. ఆపై వివరాలు తెలపాలంటూ ముగ్గురు మంజులను కర్రలతో తీవ్రంగా చావబాదారు. ఆ దెబ్బలకు మంజుల అచేతనంగా మారిపోయింది. అనంతరం మంజుల పొత్తి కడుపు ప్రాంతంలో కత్తితో కోసి హత్య చేశారు. ఆపై నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యకు పాల్పడిందని తండా వాసులను నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా, మంజుల మృతదేహాన్ని తమ వ్యవసాయ పొలంలో పూడ్చిపెట్టారు.
అయితే, ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకి పోలీసులకు చేరింది. దీంతో శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంజుల తల్లి సోనిని మంజుల మృతిపై ఆరా తీశారు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చినందుకు మందలించడంతో మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని సోని తెలిపింది.
అయితే పాతిపెట్టిన మంజుల మృతదేహాన్ని బయటకుతీసి చూడగా తలపై తీవ్ర గాయాలు, పొత్తికడుపుపై కత్తితో కోసిన అనవాళ్ళు కనిపించాయి. దీంతో మంజులది ఆత్మహత్య కాదు పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించి మంజుల తల్లి సోని, సోదరులు జగన్, బబ్లూలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.