ఆ వానరానికి కోపం వచ్చింది.. ఏం చేసిందో తెలుసా?
ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ
ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ కాలనీలో జనగామ వెంకటేశ్ అనే యువకుడు కొన్ని తినుబండారాలను తీసుకుని వెళుతుండగా, ఓ కోతి వాటిని లాక్కోబోయింది. దీంతో వెంకటేష్ పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని దాన్ని బెదిరించాడు. అంతే కోతికి కోపం వచ్చేసింది.
పక్కనే వున్న పొయ్యిలో మండుతున్న కర్రను అందుకుని.. పక్కనే వున్న తాటిచెట్టు ఎక్కింది. దీంతో తాటికొమ్మలకు మంటలు అంటుకుని, పక్కనున్న చెట్లకు మంటలు వ్యాపించాయి. తొలుత పిడుగు పడి చెట్లు కాలుతున్నాయని అక్కడి వారు భావించారు. దీంతో అవి ఎక్కడ ఇళ్లపై పడతాయోనని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.
ఆపై మంటలు చెట్ల వరకూ మాత్రమే పరిమితం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పనిచేసిన ఆ కోతి ఓ కుర్రును పట్టుకుని తాటిచెట్టు కిందనే కూర్చుని వుండిపోయింది. దీన్ని చూసిన గ్రామస్థులంతా షాక్ తిన్నారు.