Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో)

ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా నెరవేరుస్తామో వివరిస్తామన్నారు వైసిపి ఎమ్మెల్యే ఆర్ కే.రోజా. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertiesment
మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో)
, మంగళవారం, 11 జులై 2017 (16:25 IST)
ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా నెరవేరుస్తామో వివరిస్తామన్నారు వైసిపి ఎమ్మెల్యే ఆర్ కే.రోజా. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ 9 హామీలను ఎలా నెరవేరుస్తారో చర్చకు రండంటూ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇచ్చిన సవాల్‌కు తాము సిద్ధమన్నారు రోజా.
 
జగన్ ఇచ్చిన తొమ్మిది హామీలు నవరత్నాల్లాంటివని, ఆ హామీలను విన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు నవరంధ్రాల్లో అలజడి మొదలైందని, ఇక మిగిలింది నారావారి పాలనకు అంతమేనన్నారు రోజా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనని, అబద్ధాల్లో బాబుకు నోబుల్ అవార్డు కూడా ఇచ్చారని విమర్శించారు. కన్నతల్లికి కొరివి పెట్టని చంద్రబాబు కూడా మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. 
 
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ పైన విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రోజా. పౌష్టికాహార లోపంతో జనాలు చచ్చిపోతుంటే ఆ విషయాన్ని పట్టించుకోని పరిటాల సునీత ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైసిపి సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంటే అధికార పార్టీకి వెన్నులో భయం పట్టుకుందని, తాము ఎవర్ని సలహాదారుడిగా పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎందుకని ప్రశ్నించారు. మహిళలు ఉద్యమిస్తున్న మద్యపాన నిషేధంపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా వ్యాఖ్యలు... వీడియో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు: శశికళ భర్త నటరాజన్