Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా ఐరన్ లెగ్ కాదు అదృష్టవంతురాలు... ఎందుకంటే?

వైసిపి ఎమ్మెల్యే ఒకింటివారయ్యారు. రోజా ఒకింటి వారవడమేంటి అనుకుంటున్నారా.. ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు కదా. ఇప్పుడేంటి ఒకింటివారు కావడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా..చిత్తూరు జిల్లాలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో రోజా సొంతి

Advertiesment
MLA Roja
, సోమవారం, 7 ఆగస్టు 2017 (13:34 IST)
వైసిపి ఎమ్మెల్యే ఒకింటివారయ్యారు. రోజా ఒకింటి వారవడమేంటి అనుకుంటున్నారా.. ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు కదా. ఇప్పుడేంటి ఒకింటివారు కావడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా..చిత్తూరు జిల్లాలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో రోజా సొంతింటిని కట్టుకునేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రోజా ఈ ఆలోచన చేశారట. అందుకే సొంత ఇంటిని నిర్మించికునేందుకు నిన్న భూమి పూజ కూడా చేశారు.
 
భర్త సెల్వమణి, ఇద్దరు పిల్లలతో కలిసి రోజా భూమి పూజలో పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో బోరును ఏర్పాటు చేసుకోవడానికి రోజా పూజ చేయగా 70 అడుగుల లోతులోనే నీళ్ళు ఒక్కసారిగా ఉబికి పైకి వచ్చాయట. దీంతో రోజా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రోజా ఐరన్ లెగ్ కాదు అదృష్టవంతురాలంటూ అందరూ అక్కడ చెవులు కొరుక్కుకోవడం ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిని చూసేందుకు ఇంటికొచ్చిన టెక్కీ.. తలుపు తీయగానే షాక్...