Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముద్దులు పెట్టడం మినహా జగన్‌కు ఏం తెలుసు : ఎమ్మెల్యే జలీల్ ఖాన్

వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడిరోడ్డులో కాల్చిచంపినా పాపం లేదంటూ జగన్ నంద్యాల ఉప ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్

Advertiesment
MLA Jaleel Khan
, సోమవారం, 7 ఆగస్టు 2017 (16:05 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడిరోడ్డులో కాల్చిచంపినా పాపం లేదంటూ జగన్ నంద్యాల ఉప ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు, శ్రేణులు మూకుమ్మడిగా జగన్‌పై ఎదురుదాడికి దిగారు. 
 
ఇందులోభాగంగా, జలీల్ ఖాన్ సోమవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..ఓట్ల కోసం తప్ప జగన్ అసెంబ్లీలో ఏనాడు ముస్లీంల గురించి మాట్లాడింది లేదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి నెత్తిన చేతులుపెట్టడం, ముద్దులు పెట్టడం మినహా ప్రజలకు జగన్ చేస్తున్నది ఏమీ లేదని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు.
 
"ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నడిరోడ్డుపై కాలుస్తాననే విధంగా మాట్లాడారంటే రేపు పొద్దున జగన్ సీఎం అయితే మిమ్మల్నందరినీ ప్రాణాలతో బ్రతకనిస్తారా?" అంటూ ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. జగన్ ఏమైనా సినిమా హీరోనా లేకుంటే మహాత్మా గాంధీనా.? అంటూ ప్రశ్నించారు. 
 
"ఈనెల 9నుంచి 21వరకు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తాను అంటున్నావ్.. అక్కడికెళ్లి ఏం చేస్తావ్ తలమీద చేతులుపెడతావ్.. ముద్దులు పెడతావ్ తప్ప చేసేదేమైనా ఉందా.. ఇప్పటి వరకూ ఎక్కడైనా వంద రూపాయిలిచ్చారా?" అంటూ జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపార్ట్‌మెంట్ కల్చర్.. పడకగది కింద బావి.. భార్యాభర్తలు పడిపోయారు....