Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్లో గుడ్డలు కుక్కి మైనర్ కూతురిపై లైంగికదాడి.. గర్భవతిని చేసిన మారుతండ్రి.. ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే... తన కుమార్తె పట్ల కీచకుడిగా మారిపోయాడు. తండ్రి కాకపోవడంతో పాటు మారుతండ్రి బుద్ధిని బయటపెట్టాడు. మైనర్ బాలికపై పలుసార్లు లైంగికంగా దాడిచేసి గర్భవతిని చేశాడు. ఈ

Advertiesment
Minor girl
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (18:03 IST)
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే... తన కుమార్తె పట్ల కీచకుడిగా మారిపోయాడు. తండ్రి కాకపోవడంతో పాటు మారుతండ్రి బుద్ధిని బయటపెట్టాడు.  మైనర్ బాలికపై పలుసార్లు లైంగికంగా దాడిచేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేగంపేటకు చెందిన విజయ స్థానికంగా ఇంటి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె భర్త శ్రీనివాస్ 16 ఏళ్ల క్రితం చనిపోయాడు. 
 
విజయ, శ్రీనివాస్ దంపతులకు ఒక కుమార్తె వుంది. భర్త మరణించాక.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన టి.రామావతార్‌ను విజయ రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు వున్నారు. వీరంతా కలిసే వున్నారు. ఇటీవల విజయ తొలి సంతానం 16 ఏళ్ల మైనర్ బాలిక అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. అక్కడ జరిపిన టెస్టుల్లో ఆమె గర్భవతి అని తేలింది. దీంతో తన కూతుర్ని విజయ నిలదీయడంతో అసలు దురాగతం వెలుగులోకి వచ్చింది. 
 
తాను గర్భం దాల్చడానికి మారుతండ్రే కారణమని.. అతడు తాగిన మైకంలో అనేకసార్లు తనపై లైంగికంగా దాడిచేసాడని చెప్పింది. ఇంకా తాను అరవకుండా వుండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడనని చెప్పింది. దీంతో విజయ రామావతార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో రామావతార్ తాను కూతురిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్‌తో ఒప్పందం.. ట్రూకాలర్‌ యూజర్లకు వీడియో కాలింగ్