ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.విశ్వరూప్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం అత్యవసరంగా హైదరాబాద్ నగరానికి తరలించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
సెప్టెంబరు 2వ తేదీ వైఎస్ఆర్ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన వైఎస్ఆర్ వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ విశ్వరూప్‌కు వైద్యం అందించిన వైద్యులు.. ఆయనకు స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ వెళ్లాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం రాత్రి రాజమండ్రి నుంచి విశ్వరూప్‌ను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.