Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వడమాలపేట మండలంలో వైఎస్సార్ చేయూత పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా

Advertiesment
Roja
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:35 IST)
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా వడమాలపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు   వైఎస్సార్ చేయూత పంపిణి కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ, వైఎస్సార్ చేయూత వంటీ ప్రజా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని తెలిపారు.

 
జగన్ మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటిదని తెలిపారని పేర్కొన్నారు. 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని, అంటే దీనికి అనుభవం అవసరం లేదు మనసుంటే చాలని చెప్పారు. ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించి, ప్రతి ఎమ్మెల్యేకి మళ్ళీ రెండు కోట్లు కేటాయించారని వివరించారు. ఈరోజు నిజమైన గాంధీ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని, అలాగే అంబేద్కర్ గారు లాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

 
నిజంగా ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నో పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నా, గొప్పగొప్ప ఆలోచనలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం జగనన్నకే ఉందనీ, కాబట్టి దేశం మొత్తం అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో అమ్మ ఒడి ప్రారంభించారని, మన ప్రధానమంత్రి గారూ నాడు నేడు ప్రోగ్రాంని ఇన్స్పైర్ అయ్యి అమలు చేస్తున్నారని తెలిపారు.

webdunia
వైస్సార్ చేయూత పథకం కింద వడమాలపేట మండలంలో 2020-21వ సంవత్సరానికి 1,561 మందికి 2,92,68,750 రూపాయలు, 2021-22వ సంవత్సరానికి 1,715 మందికి 3,21,56,250 రూపాయలు, 2022-23 వ సంవత్సరానికి 1,866 మందికి 3,49,87,500 రూపాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యకమంలో మంత్రి గారి సోదరులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు, వడమాలపేట ఎం.పి.పి, వైస్ ఎం.పి.పిలు, రాష్ట్ర కమీషన్ డైరెక్టర్లు, డిసిసిబి వైస్ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్లు, సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే జోన్‌పై రైల్వే బోర్డు ఛైర్మన్‌ త్రిపాఠితోనే ప్రకటన చేయిస్తా : జీవీఎల్