డేరా బాబా కంటే డేటా దొంగ చాలా డేంజరస్ అని మంత్రి రోజా అన్నారు. ప్రజా సాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా డీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు.
డేటా చోరీ అంశంపై వేసిన హౌస్ కమిటీ తన రిపోర్టును ఇవ్వగానే టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని చెప్పారు. డేటా చోరీ అంశంపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని విమర్శించారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఒళ్లు తగ్గించుకోవడానికి ఏవేవో చేశారని... బుర్రలో గుజ్జును పెంచుకోవడానికి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని రోజా ఎద్దేవా చేశారు. న్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా? అని ఆమె సవాల్ విసిరారు.