Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇద్దరు వెధవల వల్లే ఈ ఘోరం.. వారి సంగతి నాకు వదిలేయండి : నారా లోకేష్

చిత్తూరు జిల్లా ఏర్పాడు జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. శనివారం ఉదయం మంత్రులతో కలిసి మునగలపాళెం గ్రామంలో పర్యటించిన లోకేశ్‌, ప్రతి బాధిత కుటుంబాన్ని కలుస్

ఆ ఇద్దరు వెధవల వల్లే ఈ ఘోరం.. వారి సంగతి నాకు వదిలేయండి : నారా లోకేష్
, ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (08:36 IST)
చిత్తూరు జిల్లా ఏర్పాడు జాతీయ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. శనివారం ఉదయం మంత్రులతో కలిసి మునగలపాళెం గ్రామంలో పర్యటించిన లోకేశ్‌, ప్రతి బాధిత కుటుంబాన్ని కలుస్తూ.. గుండెల నిండా ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ‘ఇసుక స్మగ్లింగ్‌ను నిలపండి. స్మగ్లర్లపై చర్యలు తీసుకోండి’ అంటూ ప్రతి గడపలో ఎదురయిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే 20 మందికి పైగా చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో  శ్మశానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించాడు. ఈ సందర్భంగా బాధితులంతా కలిసి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ముక్తకంఠంతో కోరారు. 
 
దీనికి స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ... మీ ఊరికి బిడ్డనై అన్ని విధాల ఆదుకొంటా. వాళ్ల (ఇసుక స్మగ్లర్లు) కథ నాకు వదిలిపెట్టండి’’ అని శోకంలో ఉన్న మునగలపాళెం గ్రామ వాసులకు హామీ ఇచ్చారు. ఇద్దరు వెధవల వల్లే ఊరికి ఇంత కష్టం వచ్చిందని, వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  
 
'ఈ రోజు నుంచి మీ ఊరి వంకలోకి ఇసుక ట్రాక్టర్లు రావు. నాది పూచీ. వెధవ పనులు చేసే వారి పట్ల సీఎం చాలా సీరియ్‌సగా ఉన్నారు' అంటూ రైతుల పోరాటాన్ని అభినందించారు. మామ ఈశ్వరనాయుడు, భర్త కోదండరాణిలను కోల్పోయి శోకదేవతగా ఎదురైన మహిళను చూసి లోకేశ్‌ కదిలిపోయారు. 'అమ్మా జరగకూడనిది జరిగిపోయింది. బాధపడొద్దు. 
 
మీ అన్నయ్య ఉన్నాడ'ని సాంత్వన పరిచారు. ఆమెకు ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్థులు కోరగా, చెల్లి విషయం తమకు వదిలిపెట్టాలని అన్నారు. పెద్ద కర్మలు అయ్యాక.. తానే స్వయంగా అమరావతికి పిలిపించుకొని కష్టాలు వింటానని గ్రామస్థులకు హామీఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత మృతిపై విచారణ జరిపితే ఆత్మహత్య చేసుకుంటా : జైలులో శశికళ వార్నింగ్