జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ముగ్గురు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జనసేన మంత్రుల్లో నాదెండ్ల మనోహర్ సూపర్ ఫాస్ట్. పౌరసరఫరాల శాఖ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి.
వచ్చీ రావడంతోనే ఇంకా మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే గుంటూరులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాలపై కొరడా ఝుళిపించారు. రాత్రికి రాత్రి గోదాములపై దాడులు చేయటం. అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకునే లాగా వ్యవహరించడం వంటివి మనోహర్ పనితీరుకు మార్కులు పడేలా చేశాయి.
ఇక పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే విషయంలో నాదెండ్ల మనోహర్ కీలకంగానే వ్యవహరించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు, నూనెలు, ఉల్లిపాయలు వంటివి ధరలు మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసరాల సరుకులు సరపరా చేసే వాహనంపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు, ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.