Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోరుగా హుషారుగా... బైక్ పై మంత్రి ఎమ్మెల్యే షికారు

Advertiesment
జోరుగా హుషారుగా... బైక్ పై మంత్రి ఎమ్మెల్యే షికారు
విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (13:34 IST)
ఒకరేమో రాష్ట్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి... మరొకరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే... ఇద్ద‌రికీ ప‌డ‌వ‌ల్లాంటి పెద్ద కార్లున్నాయి. కానీ, స‌ర‌దాగా బైక్ ఎక్కారు... ఊరంతా హుషారుగా చ‌క్క‌ర్లు వేశారు.

ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. అది ఒక బౌన్స్ బైక్స్ సర్వీస్ లాంచింగ్ కార్య‌క్ర‌మం. దీనికి హాజరైన స‌మాచార మంత్రి పేర్ని నాని, మల్లాది విష్ణు అనంతరం ఒకే కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. అలా కారు ఎక్కుదామని అనుకున్న వారికి.. ఉన్నట్లుంది బైక్ పై సరదాగా షికారుకు వెళ్లాలనిపించింది.

అంతే.. అనుకున్నదే తడవుగా నచ్చిన ఒక బైక్ తో రయ్ మనిపించారు. పేర్ని నాని డ్రైవ్ చేస్తుండగా.. మల్లాది విష్ణు వెనుక కూర్చొని పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఇంకేముంది ఫోటోలు అలా క్లిక్ అనిపించాయి.

లబ్బీపేట ఎంజీ రోడ్డు నుంచి మొగల్రాజుపురం, విశాలాంధ్ర, చుట్టుగుంట జంక్షన్, అల్లూరి సీతారామరాజు వంతెన నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా ప్రెస్ క్లబ్ వరకు జోరుగా హుషారుగా వీరి జర్నీ సాగింది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీల అనుచిత ప్రవర్తన : ఉపరాష్ట్రపతి వెంకయ్య కంటతడి