Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పేరుతో వంచించాడు.. హనీమూన్‌కి రూ.6లక్షలడిగాడు.. విడాకులిచ్చేయ్.. రూ.20లక్షలిస్తానన్నాడు..

ప్రేమ పేరుతో ఓ డాక్టర్ మెడికోను వంచించాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆపై పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. పెళ్లైన రెండో రోజు నుంచే వేధింపులు మొదలెట్టాడు. ఏడాది పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు. రూ

Advertiesment
Medico Alleges Dowry Harassment By Doctor
, శనివారం, 28 జనవరి 2017 (09:50 IST)
ప్రేమ పేరుతో ఓ డాక్టర్ మెడికోను వంచించాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆపై పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. పెళ్లైన రెండో రోజు నుంచే వేధింపులు మొదలెట్టాడు. ఏడాది పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు. రూ.20 లక్షలిస్తా.. విడాకులు ఇవ్వాలన్నాడు.

ఇక భర్త వేధింపులు తాళలేక బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్త డాక్టర్‌ క్రొత్తపల్లి సాయికృష్ణ, అతడి తల్లిదండ్రులు నాగార్జున వర్సిటీ రెక్టార్‌ క్రొత్తపల్లి సాంబశివరావు, టుబాకో బోర్డు ఫీల్డ్‌ ఆఫీసర్‌ కృష్ణశ్రీలపై అమలాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన కంఠమనేని భవాని శంకర్‌, వాణి దంపతులు కొన్నేళ్లుగా గుంటూరు ఎస్‌వీఎన్‌ కాలనీలో ఉంటున్నారు. వారి కుమార్తె బేబి లక్ష్మి 2013లో ఎన్నారైలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. 2015లో అమలాపురం కిమ్స్‌లో జనరల్‌ సర్జన్‌ విభాగంలో పీజీలో చేరింది. అప్పటికే అదే కళాశాలలో ఎండీ మూడో సంవత్సరం చదువుతున్న గుంటూరులోని బ్రాడీపేట 6/19కి చెందిన క్రొత్తపల్లి సాయికృష్ణ బేబి లక్ష్మీని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 
 
కట్నం లేకుండా చేసుకుంటామని భవాని శంకర్ తల్లిదండ్రులు బేబి లక్ష్మి తల్లిదండ్రులను అడగటంతో అందుకు వారు అంగీకరించారు. 2015 అక్టోబర్‌ 18న నిశ్చితార్థం, నవంబర్‌ 14న వివాహం జరిగాయి. పెళ్లి సందర్భంగా బేబి లక్ష్మి కుటుంబ సభ్యులు ఎకరం నిమ్మతోట సహా కాకుమాను మండలం గార్లపాడులోని 10 ఎకరాల పొలం, 100 సంవర్ల బంగారం, కారు లాంఛనాల కింద ముట్టచెప్పారు. రూ. 50 లక్షల వరకు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు.
 
హనీమూన్‌ వెళ్లేందుకు రూ. 6 లక్షలు ఇవ్వాలని సాయికృష్ణ డిమాండ్‌ చేయగా బేబి లక్ష్మి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచే సాయికృష్ణ నుంచి వేధింపులు మొదలైనాయి. అప్పటి నుంచి బేబి లక్ష్మిని అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో లాభం లేదనుకున్న బాధితురాలు నిద్రమాత్రలు మింగేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజం మాట్లాడుతాను కాబట్టే నన్ను వెనక్కి నెట్టారు.. ఎన్నో దెబ్బలు తగిలాయ్: హరికృష్ణ