Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదో తరగతి ప్రేమ.. బలవంతంగా లైంగిక దాడి.. పెళ్లి కూడా రద్దు..

పదో తరగతిలో ప్రేమ పేరిట ఓ యువతిని ఓ దుర్మార్గుడు లొంగదీసుకున్నాడు. అలాగే లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక కడుపులోనే దాచుకున్న బాధిత యువతి కామాంధుడి చేతిలో పలుమార్లు నలిగిపోయింది.

పదో తరగతి ప్రేమ.. బలవంతంగా లైంగిక దాడి.. పెళ్లి కూడా రద్దు..
, గురువారం, 12 ఏప్రియల్ 2018 (13:43 IST)
పదో తరగతిలో ప్రేమ పేరిట ఓ యువతిని ఓ దుర్మార్గుడు లొంగదీసుకున్నాడు. అలాగే లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేక కడుపులోనే దాచుకున్న బాధిత యువతి కామాంధుడి చేతిలో పలుమార్లు నలిగిపోయింది. ఇలా యువతిని పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్న దుండగుడు చివరికి ఆ యువతి వివాహాన్ని కూడా జరగనీయకుండా చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా, జవహర్‌ నగర్ నాగారం గ్రామంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ జిల్లా నాగారం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌యాదవ్‌, పక్కనే ఉన్న దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన యువతిని పదో తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇలా బలవంతంగా ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక యువతి వేధింపులను దాచేసింది. అలా పదో తరగతి నుంచి డిగ్రీవరకు ఆ కామంధుడు యువతిని వేధించసాగాడు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.

 
 
మంచి సంబంధం రావడంతో ఇరువైపుల పెద్దలూ కూర్చోని మాట్లాడుకుని ఏప్రిల్‌ 19న వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తనతో రాకపోతే.. కట్టుకోబోయే భర్తతో మొత్తం చెప్పేస్తానని బెదిరించాడు. పరువు కోసం శ్రీకాంత్‌ను 30న కలిసింది.
 
మేడ్చల్ నుంచి భువనగిరి ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లిన దుండగుడు యువతిపై మరోసారి లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా యువతిని చేసుకోబోయే వరుడికి ఈ విషయాలన్నీ చెప్పి పెళ్లిని రద్దు చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు ధైర్యం చేసుకుని తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పరారిలో వున్న శ్రీకాంత్‌‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు మొదలెట్టారు. ఈ కేసులో కాల్ రికార్డ్స్ కీలకంగా మారనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో శాంతి పరిరక్షణకు కట్టుబడివున్నాం : ప్రధాని నరేంద్ర మోడీ