తిరుమల శ్రీవారి సేవలో మారిషెస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. ముందుగా తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన సతీమణిలో కలిసి కలియుగ ప్రత్యేక్షదైవమైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మారిషెస్ ప్రధాని వెంట రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు.
సెప్టెంబరు 9వ తేదీన భారత్ పర్యటనకు విచ్చేసిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర.. సెప్టెంబరు 11న ప్రధాని నరేంద్ర మోడీతో వారణాసిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలు అధికంగా ఉండే మారిషస్‌కు మన దేశం రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. భారత్‌లో నవీన్ చంద్ర పర్యటన ఈ నెల 16తో ముగియనుంది.