Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటి యజమాని దాడి.. కరెంట్ తీగతో ఉరేసుకున్న సుజాత.. రాత్రంతా తల్లి శవం వద్దే పిల్లలు.. ఏడ్చి ఏడ్చి..?

ఇంటి ఓనర్ వేధించడంతో కూకట్ పల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిన్నారుల సందడి ఇంటి యజమానికి అల్లరిగా తోచింది. అంతే పిల్లలు గోల చేస్తున్నారంటూ గృహిణితో గొడవకు ద

ఇంటి యజమాని దాడి.. కరెంట్ తీగతో ఉరేసుకున్న సుజాత.. రాత్రంతా తల్లి శవం వద్దే పిల్లలు.. ఏడ్చి ఏడ్చి..?
, మంగళవారం, 8 నవంబరు 2016 (09:55 IST)
ఇంటి ఓనర్ వేధించడంతో కూకట్ పల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. చిన్నారుల సందడి ఇంటి యజమానికి అల్లరిగా తోచింది. అంతే పిల్లలు గోల చేస్తున్నారంటూ గృహిణితో గొడవకు దిగాడు. ఆ గొడవ చిలికి చిలికి పెద్దదై.. చివరికి తన భార్యతో కలిసి ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన సుజాత అనే ఆ గృహిణి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తల్లికి ఏమైందో తెలియక ఆ ఇద్దరు చిన్నారులు రాత్రంతా తల్లి శవం వద్దే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లారు. ఉదయాన్నే ఊరి నుంచి వచ్చిన భర్త జరిగిన ఘోరాన్ని చూసి గుండెలవిసేలా విలపించటం అందర్నీ కదిలించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రామకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఐదేళ్ల క్రితం గుంటూరుజిల్లా కారుమంచి గ్రామానికి చెందిన సుజాతతో వివాహమైంది. కొలువు కోసం నగరం చేరిన ఆలుమగలు కూకట్‌పల్లి శ్రీనివా్‌సకాలనీలో ఉంటున్నారు.
 
ఇంటి యజమానులు ప్రసన్నకుమార్‌, స్నేహలత దంపతులు మొదటి ఫ్లోర్‌లో ఉండగా, సెకండ్‌ ఫ్లోర్‌లో రామకృష్ణ దంపతులు ఉంటున్నారు. వీరికి మూడున్నరేళ్ల బాబు, ఏడాదిన్నర పాప. ఈ చిన్నారుల ఆటాపాటలకు ఇంటి ఓనర్‌ చికాకు పడేవాడు. పిల్లలు అల్లరి చేస్తే.. గోలంటూ పరుష పదజాలంతో గొడవపెట్టుకునేవాడు. ఇలా నవంబర్ 4వ తేదీ రామ కృష్ణ పెళ్లి వేడుక వెళ్లగా.. ఇంటి ఓనర్ భార్యతో కలిసి సుజాతపై దాడి చేశాడు.  జరిగిన ఘటనను తీవ్ర అవమానంగా భావించిన సుజాత.. భర్తకు ఫోన్‌చేసింది. జరిగిందంతా చెప్పుకుని బోరుమంది. చివరికి అర్ధరాత్రి సమయంలో కరెంటుతీగతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని భార్య స్నేహలతను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి యజమాని ప్రసన్నకుమార్‌ పరారీలో ఉన్నాడు. మరోవైపు సుజాత మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్యానికి డబ్బుల్లేక... మహాత్మా గాంధీ మనవడు కాను గాంధీ మృతి