Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనత్త దాష్టీకానికి బాలిక బలి.. 13యేళ్లకే పెళ్లి... మత్తిచ్చి పడక గదిలోకి

మేనత్త దాష్టీకానికి ఓ బాలిక బలైంది. కేవలం 13 యేళ్ళకే బాలికకు పెళ్లి చేసి ఆ తర్వాత పాలలో నిద్రమాత్రలు కలిపి పడకగదిలోకి పంపించి కన్నెరికాన్ని చెరిపేసింది.

Advertiesment
మేనత్త దాష్టీకానికి బాలిక బలి.. 13యేళ్లకే పెళ్లి... మత్తిచ్చి పడక గదిలోకి
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (12:37 IST)
మేనత్త దాష్టీకానికి ఓ బాలిక బలైంది. కేవలం 13 యేళ్ళకే బాలికకు పెళ్లి చేసి ఆ తర్వాత పాలలో నిద్రమాత్రలు కలిపి పడకగదిలోకి పంపించి కన్నెరికాన్ని చెరిపేసింది. అదీకూడా 35 యేళ్ళ ఓ కామాంధుడితో. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, 
 
పిడుగురాళ్ళకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల కుమార్తెను వెంకయ్య సోదరి నాగలక్ష్మి పెంచుకుంటోంది. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని, కందుకూరు తీసుకెళ్లి, రహస్యంగా ఓ గుడిలో 35 ఏళ్ల మనోజ్‌తో తాళి కట్టించింది. ఈ విషయాన్ని ఆ  బాలిక తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. 
 
ఈ క్రమంలో మెడలో మూడుముళ్లు పడిన తర్వాత బాలికకు శోభనం చేసేందుకు మత్తు మందిచ్చి పడక గదిలోకి పంపించింది. మెలకువ వచ్చిన తర్వాత, "భయంగా ఉంది, తలుపులు తెరవండి" అని ఆమె మొత్తుకున్నా వదిలిపెట్టలేదు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికను చిత్ర హింసలు పెట్టారు. పెళ్లి గత నెల 25న జరుగగా, అప్పటి నుంచి విషయం ఎవరికీ చెప్పవద్దని రోజూ హింసిస్తున్నారు. 
 
బిడ్డను చూసి పోదామని తల్లి వచ్చేంత వరకూ వారి దాష్టీకం సాగింది. పాప ఒంటిపై గాయాలు చూసి బోరుమన్న పార్వతి, తన బిడ్డ గొంతు కోశారని ఆరోపించింది. ఆధార్ కార్డులో వయసు 13 ఏళ్లని ఉండగా, దాన్ని 20కి మార్చి ఈ పెళ్లిని జరిపించారని ఆరోపించింది. దీనిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా అధికారివి... నీయయ్య.... నాకే ఎదురు చెప్తావా? : తెరాస ఎమ్మెల్యే బూతుపురాణం