Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నా మొగుడు వేధింపులు ఎక్కువయ్యాయి... చంపేద్దాం'... ప్రియునితో కలిసి భర్త హత్య

నా మొగుడు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక పోతున్నా. పైగా, నీతోనూ సంతోషంగా ఉండలేకపోతున్నా. అందువల్ల నా భర్తను చంపేద్దాం అంటూ ప్రియుడిని రెచ్చగొట్టిన ఓ మహిళ... అన్నంత పని చేసింది.

Advertiesment
Murder
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (09:07 IST)
నా మొగుడు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక పోతున్నా. పైగా, నీతోనూ సంతోషంగా ఉండలేకపోతున్నా. అందువల్ల నా భర్తను చంపేద్దాం అంటూ ప్రియుడిని రెచ్చగొట్టిన ఓ మహిళ... అన్నంత పని చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌లోని హకీంపేటకు చెందిన గౌస్‌(45), ఫాతిమా దంపతులకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గౌస్‌ వీడియో, ఫొటోగ్రాఫర్‌గా, ఆటోడ్రైవర్‌గా పనులు చేసేవాడు. సంపాదించిన డబ్బంతా తాగుడు ఖర్చు చేయడంతో పాటు భార్యను హింసించేవాడు. 
 
ఈ క్రమంలో గౌస్‌ మిత్రుడైన అక్బర్‌కు ఫాతిమా దగ్గరైంది. అతనితో కలిసి భర్తను చంపించాలని పథకం వేసింది. అక్బర్‌ తన తమ్ముడు ఆరిఫ్‌కు ఆ బాధ్యత అప్పగించి రూ.70 వేలు ఇచ్చాడు. ఆరిఫ్‌ తన మిత్రులైన తాడూరి భాస్కర్‌(25), ముదినోల్ల శివ(26), శ్రావణ్‌(25)లను ఒప్పించాడు. 
 
జనవరి 21న అక్బర్‌.. గౌస్‌ ఇంటికి వెళ్లి ఫొటోలు తీయాలి రమ్మంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లి తన తమ్ముడు ఆరిఫ్‌కు అప్పగించాడు. వారంతా కొండపాక మండలం వెలికట్ట శివారులోని సిరి డెవలపర్స్‌ ప్లాట్లలోకి తీసుకెళ్లి ఇనుపరాడ్‌తో కొట్టి చంపి శవాన్ని అక్కడే పడేసి వెళ్లారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్యతో పాటు.. ఆమె ప్రియుడు అక్బర్‌, అతని తమ్ముడు ఆరిఫ్‌, భాస్కర్‌, శివలను అరెస్ట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఢిల్లీ యాత్రకొచ్చారు... రాష్ట్రపతి ఏం చేస్తారు.. కాసిని కాఫీ ఇస్తారు : జేసీ దివాకర్ రెడ్డి