Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహితను ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తి సూసైడ్.. ఎందుకు?

బెంగుళూరులో ఓ భర్త నుంచి విడాకులు పొందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... కర్నాటక రాష్ట్రంలోని నల్లాండహళ్లి గ్రామా

Advertiesment
వివాహితను ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తి సూసైడ్.. ఎందుకు?
, ఆదివారం, 11 జూన్ 2017 (13:01 IST)
బెంగుళూరులో ఓ భర్త నుంచి విడాకులు పొందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... కర్నాటక రాష్ట్రంలోని నల్లాండహళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌ (28) స్థానిక మాడ్రన్‌ పాఠశాల వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
ఈ క్రమంలో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన యశోద అనే మహిళను సుధాకర్‌ ప్రేమించాడు. నెల రోజుల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్లిన సుధాకర్‌ సాయంత్రం ఇంటికి చేరుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చూపులకు ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ఒరాకిల్ టెక్కీ