Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరాసలోకి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి.. టీడీపీలోకి వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఫిరాయింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertiesment
తెరాసలోకి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి.. టీడీపీలోకి వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
, బుధవారం, 1 జూన్ 2016 (12:30 IST)
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఫిరాయింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
తెరాసలో తన చేరికను ఎంపీ మల్లారెడ్డి ఖరారు చేశారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యమయ్యేందుకు తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో అనుచరులతో ఎంపీ మల్లారెడ్డి సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మల్లారెడ్డి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. 
 
బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరనునున్నట్లు వెల్లడించారు. తెరాస ప్రభుత్వ పథకాలు తనను ఆకర్షించాయని, తెరాసలో చేరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మరింత కృషి చేయనున్నట్లు చెప్పారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ మంచి పథకాలన్నారు. ఎపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మంచి విజన్‌ ఉన్న నేతలని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
 
మరోవైపు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి బుధవారం తెదేపాలో చేరనున్నారు. ఉదయం గిద్దలూరు నుంచి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి విజయవాడ బయల్దేరారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అశోక్‌రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్యత్వ పరీక్షల్లో భార్య విఫలమైందనీ గంటల్లో విడాకులిచ్చిన భర్త.. వత్తాసు పలికిన పంచాయతీ పెద్దలు