బంగాళాఖాతంలో వాయుగుండం...
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగా
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
కాగా, ఈ వాయుగుండం ప్రభావం కారణంగా కోస్తా జిల్లాలతో పాటు.. తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే, చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాల్లో ఆకాశం దట్టమైన మేఘాలు ఉన్నాయి.