Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీస్ స్టేషన్‌లో ప్రేమికులకు పెళ్లి.. కానీ ఉరేసుకున్న జంట.. ఆపై ఏం జరిగింది?

Advertiesment
Lovers
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్‌లో పెళ్లి జరిగినా వారి పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈశ్వర్‌నగర్‌లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్‌లో వివాహం చేసుకున్నారు. 
 
పోలీసులు ఇరువైపుల పెద్ద మనుషులను పిలిపించి పోలీస్ స్టేషన్‌లో పెళ్లి జరిపించారు. కానీ శివ తల్లి ఒప్పుకోకపోవడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. 
 
ప్రస్తుతం శివ నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన కుమార్తెను హత్య చేసి ఉరేశారని, శివ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడని స్వప్న తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. శివ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత