Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

పెళ్లికి నిరాకరించిన యువతి... కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

Advertiesment
sadist husband
, గురువారం, 4 ఆగస్టు 2022 (10:01 IST)
ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రేమికుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిన యువతిని కారుతో ఢీకొట్టించి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కిరాతక ప్రేమికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేటకు చెందిన భాస్కర్‌ అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తూ వచ్చాడు. యువతి తండ్రి మృతి చెందగా ఆయన ఉద్యోగం తల్లికి వచ్చింది. బదిలీపై ఇటీవల కళ్యాణదుర్గానికి వచ్చి గుండ్లప్పదొడ్డి కాలనీలో అద్దె ఇంట్లో యువతి, తల్లి, అవ్వతో కలిసి ఉంటున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న భాస్కర్.. అక్కడకు వచ్చి కూడా వేధించసాగాడు. ఈ క్రమంలో మాట్లాడాలని సోమవారం (ఆగస్టు 1న) యువతిని పిలిచాడు. ఆమె కంబదూరు రోడ్డులోకి ద్విచక్రవాహనంపై వెళ్లగా యువకుడు కారులో వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అన్న వరుస అవుతావని, కుదరని తెగేసి చెప్పింది. 
 
దీన్ని భాస్కర్ జీర్ణించుకోలేక ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. బోయలపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొనగా కిందపడిన యువతి తలకు తీవ్రగాయాలయ్యాయి. కుడికాలు విరిగింది. గ్రామస్థులు కేకలు వేయడంతో భాస్కర్‌ వేగంగా కారును పోనిచ్చాడు. 
 
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో రోడ్డుపక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది. రోడ్డు ప్రమాదంగా భావించి భాస్కర్‌ను అదే రోజు రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చంపాలని నిర్ణయించుకొన్నానని నిందితుడు అంగీకరించాడన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య