పెళ్లైన వ్యక్తితో ప్రేమతో పడి.. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గన్నవరం పట్టణంలోని సినిమా హాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహ్మద్ జాస్మిన్ (20) బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది.
ఈమెకు గన్నవరానికే చెందిన ఎస్కే జబీబుల్లా 27 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి పెళ్లి కావడంతో పాటు భార్యాఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే జాస్మిన్, జబీబుల్లాల పరిచయం ప్రేమగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. అతడిని అనేక సార్లు హెచ్చరించారు. దీనికి తోడు రెండు రోజుల పాటు జబీబుల్లా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది.
వెంటనే జాస్మిన్ కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జబీబుల్లాను అదుపులోకి తీసుకున్నారు.