Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె

liquor bottles

ఐవీఆర్

, మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు సోమవారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసారు. ఈ ఎంపికలో కోట్లకొద్ది ధనం పెట్టి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు. మద్యం షాపుల లాటరీలో లక్కీగా నంద్యాల దివంగత మాజీ ఎంపి, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె ఏకంగా 10కి పైగా షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, పీలేరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఆమె ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ స్థాయిలో ఒక్కరినే ఇలా అదృష్టం వరించడం చర్చనీయాంశమవుతోంది.
 
మరోవైపు రాష్ట్రమంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్లతో 100 దరఖాస్తులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తుల్లో ముగ్గురిని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద పూర్తి వివరాలు బయటకు వస్తే.. ఇంకా ఎంతమంది అదృష్టవంతులను ఈ మద్యం షాపులు వరించాయో తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు ప్రజలకు గుడ్ న్యూస్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 98 కోట్లు