Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

టీడీపీ తిరగబడితే వైసీపీ ఉండలేదు:నారా లోకేశ్

Advertiesment
lokesh
, బుధవారం, 10 జులై 2019 (06:48 IST)
ప్రజా సంక్షేమం కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తేస్తే.. ప్రజలు జగన్ నూ ఎత్తేస్తారన్నారు మాజీ మంత్రి లోకేశ్.
గన్నవరం మండలం హనుమాన్ జoక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి లోకేశ్ హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను పట్టిసీమకు వ్యతిరేకమని గతంలో స్వయంగా అసెంబ్లీ లో చెప్పిన జగన్.. ఇప్పుడు పట్టిసీమపై ప్రజలకు క్షమాపణ చెపుతారా? అని ప్రశ్నించారు. అమ్మఒడి ఎవరికి ఇవ్వాలో మంత్రులకే అవగాహన లేదన్నారు. రాయలసీమ లో విత్తనాలు ఇవ్వకుండా రైతు దినోత్సవం చేశారన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన తర్వాత  45 రోజుల్లో జగన్ అనేక యూ టర్న్ లు తీసుకున్నారన్నారు లోకేశ్. రాష్ట్రంలో అన్ని నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులు ఆపాలని హెచ్చరించారు. టీడీపీ తిరగ బడితే గ్రామాల్లో  వైసీపీ వాళ్ళు ఉండలేరన్నారు లోకేశ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై అధికారులతో జగన్ చర్చ..ప్రభుత్వ ఉద్దేశాలు బిల్లులో స్పష్టంగా కనిపించాలన్న సీఎం