ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనకు కేసులు, అరెస్టులు భయం పట్టుకుంది. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు విపక్షనేతలను నానా రకాలైన వేధింపులకు గురిచేసి అరెస్టు చేయించారు. ఇపుడు రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసుకోవడంతో తనను కూడా ఇదే విధంగా చేస్తారన్న భయం పట్టుకుంది. దీంతో ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వదిలి కర్నాటక రాష్ట్రానికి పారిపోయారు. ఇదిలావుంటే, లోక్‌సభ స్పీకర ఎన్నిక బుధవారం జరుగుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఎన్డీయే కూటమికి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఇతర పార్టీల మద్దతును కోరుతుంది. ఇందులో భాగంగా, నలుగురు ఎంపీలున్న వైకాపా మద్దతు కూడా అడిగేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే, వైకాపా అధినేత జగన్ మాత్రం అడక్కుండానే ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం గమనార్హం. దీనికి కారణం ఒకవైపు కేసులు, మరోవైపు అరెస్టు భయంతో ఈ పని చేశారు. ఇపుడు ఎన్డీయే కూటమి బలం వైసీపీ మద్దతుతో 297కి పెరిగినట్టయింది. ఏపీ అధికార పక్షం టీడీపీ ఎన్డీయేలో ఉండగా, వైసీపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఎన్డీయేకి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది.
నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక : విప్ జారీ చేసిన టీడీపీ!!
లోక్‌సభ సభాపతి ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా మరోమారు పోటీ చేస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు, స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరై తమ మద్దతు తెలియజేయాల్సివుంది.
ఈ పరిస్థితుల్లో తన 16 మంది ఎంపీలకు టీడీపీ మూడు వాక్యాలతో కూడిన విప్ జారీచేసింది. టీడీపీ ఎంపీలందరూ రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ చీఫ్ విప్ జీఎం హరీశ్ బాలయోగి విప్ జారీచేశారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఉండటంతో పాటు ఎన్డీయే స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.
లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలో టీడీపీ లోక్‌సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశం తర్వాత టీడీపీ ఎంపీలంతా కలిసి పార్లమెంట్ భవనానికి వెళతారు.