Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#GaneshChaturthi : గణనాథుడికి పూజలు.. గవర్నర్, సీఎం శుభాకాంక్షలు (Video)

దేశ వ్యాప్తంగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాటు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని విఘ్నేశ్వరుడు పూజలందుకునేందుకు ఆయా మండలపాలకు చేరుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ పూజలు బ్రహ్మాండంగా జరుగనున్నాయి. వ

#GaneshChaturthi : గణనాథుడికి పూజలు.. గవర్నర్, సీఎం శుభాకాంక్షలు (Video)
, శుక్రవారం, 25 ఆగస్టు 2017 (10:08 IST)
దేశ వ్యాప్తంగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాటు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని విఘ్నేశ్వరుడు పూజలందుకునేందుకు ఆయా మండలపాలకు చేరుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ పూజలు బ్రహ్మాండంగా జరుగనున్నాయి. వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గణేశుడి మండపాలకు వస్తున్నారు.
 
ముంబై ప్రసిద్ధి గాంచిన లాల్ బాగ్ఛా రాజా గణేశుడు, సిద్ధి వినాయక దేవాలయం సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడు, రాజస్థాన్‌లో మోతి డుంగ్రి టెంపుల్ తోపాటు వివిధ రాష్ట్రాల్లో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 
కాగా, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు అత్యంత ప్రముఖమైన ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని గవర్నర్ చెప్పారు. చవితి సంబురాల్లో యువత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 
 
విఘ్నాలు తొలగించి తమను విజయపథంలో నడిపించడానికి వినాయకుడికి భక్తులంతా పూజలు నిర్వహిస్తారన్నారు. కష్టాల్లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని, అన్ని పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందాలని సీఎం ఆకాంక్షించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడో విడత రైతు రుణ మాఫీ... రూ.3,600 కోట్లు విడుదలకు సీఎం బాబు నిర్ణయం