Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

భార్యకు నరకం చూపిన న్యాయవాది.. 11ఏళ్లు ఇంట్లోనే బంధించాడు..

Advertiesment
woman
, గురువారం, 2 మార్చి 2023 (11:05 IST)
తాళికట్టిన భార్యకు ఓ న్యాయవాది నరకం చూపాడు. ఏకంగా 11 సంవత్సరాల పాటు ఇంట్లోనే బంధించాడు. ఆమెను బయట ప్రపంచానికి దూరం చేసి నానా ఇబ్బందులకు గురిచేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాలు కఠినమైన జీవితాన్ని అనుభవించింది ఆ బాధితురాలు. తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకుని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తి విజయనగరంకు చెందిన న్యాయవాది మధుసూదన్.  
 
అత్తవారింటి ఆంక్షలతో పన్నెండేళ్ల గృహ నిర్భంధం తరువాత భాహ్యప్రపంచంలోకి వచ్చింది పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ. ఈమెకు 2008లో మధుసూదన్‌తో వివాహం జరిగింది. 
 
ఇంట్లో పనిమనిషి అవతారం ఎత్తి ధీనంగా గడిపిన ఆ అభాగ్యురాలు కోర్టు ఆదేశాలతో తల్లిదండ్రుల చెంతకు చేరింది. అత్తవారింటి ఆంక్షలతో పన్నెండేళ్ల గృహ నిర్భంధం తరువాత భాహ్యప్రపంచంలోకి వచ్చింది. 
 
పెళ్ళైన తరువాత మూడు ఏళ్లు బాగానే ఉన్న భర్త, అత్తలు ఆ తరువాత ఆంక్షలు పెట్టి సుప్రియకు నరకం చూపించాడు. ఎమ్ ఎ లిటరేచర్ వంటి ఉన్నత విద్య అభ్యసించిన సుప్రియను ఇంటికే పరిమితo చేసి అష్టకష్టాలు పెట్టారు. 
 
ఫలితంగా సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు చివరికి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన సుప్రియ ఆచూకీ కోసం గోదావరి మధుసూదన్ ఇంటికి వెళ్ళారు. 
 
చివరికి బలవంతంగా సెర్చ్ వారెంట్‌తో బాధితురాలిని కాపాడారు. న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సుప్రియను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు సుప్రియ భర్త అత్తమామలపై కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్