Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు : బీజేపీ నేత లంక దినకర్

lanka dinakar

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:48 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ దమ్మున్న నేత అని బీజేపీ నేత లంక దినకర్ అభిప్రాయపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్‌‍ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దినకర్ స్పందించారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. 
 
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో మాఫియా దురాగతాలకు అడ్డుకట్ట పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు.
 
పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం అందించారని, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం తీసుకువచ్చారని వివరించారు. కొవిడ్ సమయంలో పేదల ఆకలిని తీర్చడం కోసం రెట్టింపు బియ్యం అందిస్తే... కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు తరలిపోయిందని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nagababu: కేబినేట్‌లో నాగబాబుకు స్థానం.. జనసేనను గౌరవించేలా?