Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగనూ వేళాపాళా లేదా..? హోదాపై రాజీనామాలు అవసరమా? మళ్లీ ఆ తప్పు చేయొద్దన్న కేవీపీ..

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని.. ప్యాకేజీ ఇచ్చేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తేల్చేసిన నేపథ్యంలో.. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అనంతపురంలో నవంబర్ నెలలో జనసేన అధినేత

జగనూ వేళాపాళా లేదా..? హోదాపై రాజీనామాలు అవసరమా? మళ్లీ ఆ తప్పు చేయొద్దన్న కేవీపీ..
, బుధవారం, 26 అక్టోబరు 2016 (14:14 IST)
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని.. ప్యాకేజీ ఇచ్చేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తేల్చేసిన నేపథ్యంలో.. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అనంతపురంలో నవంబర్ నెలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ పెట్టేందుకు రెడీ అవుతుంటుంటే.. అంతకంటే ముందు.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ పెట్టేందుకు పోటీ పడుతున్నారు. 
 
అయితే జగన్మోహన్ రెడ్డి పవన్ కంటే ముందు సభ పెట్టడం ద్వారానే రాజకీయ లబ్ధి కోసం పాటుపడుతున్నారని తెలిసిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే జనసేన పెట్టే బహిరంగ సభతోనూ ఒరిగేదేమీ లేదని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిపై వైఎస్సార్ స్నేహితుడు, సన్నిహితుడు పార్లమెంట్ సభ్యుడు కేవీపీ సీరియస్ అయినట్లు వార్తలొస్తున్నాయి. 
 
జగన్మోహన్ రెడ్డికి అనుభవం అంతంత మాత్రమే కావడంతో.. సమయం, సందర్భం చూసుకోకుండా ఎప్పుడుపడితే అప్పుడు రాజకీయాస్త్రాలను వినియోగించడం జగన్ స్ట్రాటజీని దెబ్బతీస్తుందని కేవీపీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..? ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం వైకాపా యువభేరి పేరిట కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎంపీలందరి చేత రాజీనామాలు చేయించి బైపోల్‌ పేరిట ఇటు రాష్ట్రం, అటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని జగన్ యోచిస్తున్నారు. 
 
అయితే ప్రత్యేకహోదా ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా.. అంతా అయిపోయాక హోదా కోసం ఉద్యమాలు చేపట్టడం ఏమిటని కేవీపీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేయడమనే బ్రహ్మాస్ర్తాన్ని జాగ్రత్తగా సరైన సమయంలో వాడకుండా ఇప్పుడు వాడితే అది వృధా అవుతుందని కేవీపీ అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకంటే ముందు ఉప ఎన్నికల పేరు మీద జగన్ తన బలాన్ని బయటపెట్టేశాడని, దీంతో అలెర్టయిన బాబు బృందం.. జగన్‌ని సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిందనే విషయాన్ని కేవీపీ వాదిస్తున్నారు. 
 
ప్రస్తుతం జగన్ కూడా అదే తప్పు చేస్తున్నాడని కేవీపీ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. జగన్ కాంగ్రెస్‌లో లేకపోయినా.. స్నేహితుడి కుమారుడు ఇలాంటి పనులు చేస్తుండటం ద్వారా ఆతని రాజకీయ కెరీర్‌కు లబ్ధి చేకూరదనే ఆవేదనతో కేవీపీ సన్నిహితులతో వాపోతున్నారట. ఇకపోతే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా సీనియర్ రాజకీయ నేత కేవీపీ ముద్ర ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ మరణానంతరం జగన్ పెట్టిన పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ 'టాప్ లెస్' ఫొటోలు.. జర్నలిస్టులకు బిగిస్తున్న ఉచ్చు!